అచ్చం వొడాఫోన్‌ లాంటిదే : ఎయిర్‌టెల్‌ కొత్త ఆఫర్ | Airtel Now Offers Unlimited Calls, 1GB Data Per Day for 28 Days at Rs. 199  | Sakshi
Sakshi News home page

అచ్చం వొడాఫోన్‌ లాంటిదే : ఎయిర్‌టెల్‌ కొత్త ఆఫర్

Dec 2 2017 8:47 AM | Updated on Dec 2 2017 12:06 PM

Airtel Now Offers Unlimited Calls, 1GB Data Per Day for 28 Days at Rs. 199  - Sakshi

డేటా సబ్‌స్క్రైబర్లు విపరీతంగా పెరిగిపోవడం, రిలయన్స్‌ జియో, వొడాఫోన్‌ల నుంచి గట్టి పోటీతో టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ మరో కొత్త ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. అచ్చం వొడాఫోన్‌ మాదిరే రూ.199కు కొత్త ప్రీపెయిడ్‌ టారిఫ్‌ను లాంచ్‌ చేసింది. 28 రోజుల వాలిడిటీతో దీన్ని తీసుకొచ్చింది. ఈ కొత్త రూ.199 ప్యాక్‌, వొడాఫోన్‌ ప్రకటించిన కొత్త టారిఫ్‌ అనంతరం ఎయిర్‌టెల్‌ మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రూ.199 ప్యాక్‌ కింద ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్‌ సబ్‌స్క్రైబర్లు అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌ను, రోమింగ్‌పై అపరిమిత ఇన్‌కమింగ్‌ కాల్స్‌, అపరమిత లోకల్‌, నేషనల్‌ ఎస్‌ఎంఎస్‌, రోజుకు 1జీబీ 3జీ, 4జీ డేటాను 28 రోజుల పాటు అందించనున్నట్టు తెలిపింది. ఈ ప్రయోజనాలన్నీ పాత, కొత్త ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్‌ సబ్‌స్క్రైబర్లందరికీ వర్తిస్తాయి. అయితే ఈ ప్యాక్‌ ఎంపికచేసిన సర్కిళ్లకు మాత్రమే అందుబాటులోకి తెచ్చింది.

చెన్నై, ఢిల్లీ ఎన్‌సీఆర్‌, ముంబై, కర్నాటక సర్కిళ్లకు ఈ కొత్త టారిఫ్‌ ప్లాన్‌ లభ్యమవుతుంది. అయితే సబ్‌స్క్రైబర్లందరికీ మై ఎయిర్‌టెల్‌ యాప్‌లో ఈ ప్యాక్‌ యాక్టివేట్‌ అవాల్సి ఉంది. ప్రస్తుతం దీన్ని ఎయిర్‌టెల్‌ సైట్‌ నుంచి పొందాల్సి ఉంటుంది. ఈ వారం ప్రారంభంలోనే వొడాఫోన్‌ రూ.199కు కొత్త ప్రీపెయిడ్‌ ప్యాక్‌ను లాంచ్‌ చేసింది. ఈ ప్యాక్‌ కింద వొడాఫోన్‌ రోజుకు 1జీబీ డేటా, అపరిమిత ఎస్‌టీడీ, లోకల్‌ కాల్స్‌ను ఆఫర్‌చేస్తోంది. అయితే రోజు వారీ కాల్స్‌పై వొడాఫోన్‌ పరిమితి విధించింది. వొడాఫోన్‌ లాంచ్‌ చేసిన ఈ రూ.199 ప్యాక్‌ కేవలం ఢిల్లీ ఎన్‌సీఆర్‌ సర్కిల్‌ వారికి మాత్రమే.  అదనంగా ఎయిర్‌టెల్‌ రూ.157 ప్యాక్‌ను కూడా లాంచ్‌ చేసింది. ఈ ప్యాక్‌ కింద 27 రోజుల పాటు 3జీబీ 3జీ, 4జీ డేటాను ఆఫర్‌ చేస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement