ఆర్కాం, ఎయిర్ సెల్ విలీనానికి రంగం సిద్ధం | Aircel deal 'very shortly': Reliance Communications | Sakshi
Sakshi News home page

ఆర్కాం, ఎయిర్ సెల్ విలీనానికి రంగం సిద్ధం

Jun 23 2016 4:46 PM | Updated on Jun 4 2019 6:47 PM

ఆర్కాం, ఎయిర్ సెల్  విలీనానికి రంగం సిద్ధం - Sakshi

ఆర్కాం, ఎయిర్ సెల్ విలీనానికి రంగం సిద్ధం

అనిల్‌ అంబానీ నాయకత్వంలోని రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ తో మరో టెలీకాం సంస్థ ఎయిర్‌సెల్‌ సంస్థ విలీన ప్రక్రియకు రంగం సిద్ధమైంది.

ముంబై: అనిల్‌ అంబానీ నాయకత్వంలోని రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ తో మరో టెలీకాం సంస్థ ఎయిర్‌సెల్‌  సంస్థ విలీన ప్రక్రియకు రంగం సిద్ధమైంది. టెలికాం ఆపరేటర్ ఎయిర్ సెల్ తో   ప్రతిపాదిత ఒప్పందం తొందర్లోనే పూర్తి  కానుందని గురువారం ప్రకటించింది. ఈ విలీనాన్ని  త్వరలో  ప్రకటిస్తామని   రిలయన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.  ఈ  నేపథ్యంలో  విలీనంపై ఎయిర్ సెల్ తో ఆర్‌కామ్‌ యాజమాన్యం చర్చలు జరుపుతోందని తెలిపింది. కంపెనీ అందించిన  సమాచారం ప్రకారం ఎయిర్ సెల్  వాటాదారులైన మాక్సిస్ కమ్యూనికేషన్స్ బెర్హాడ్ అండ్ సింధ్య  సెక్యూరిటీస్ , ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ తో చర్చలు  జరుగుతున్నాయి.   ఇండియన్ వైర్ లెస్ వ్యాపారంలో  ఉమ్మడి వ్యాపారానికి ఒప్పందం కుదురుతుందనే ధీమాను వ్యక్తం చేసింది.  డీల్  పూర్తి అయిన  తర్వాత దీనికి సంబంధించిన లావాదేవీలను ప్రకటిస్తామని పేర్కొంది.  
కాగా ఈ వార్తలతో మార్కెట్ల ఆర్ కాం  షేర్ 6 శాతం లాభాలను నమోదు చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement