భారీ డిమాండ్‌: వారానికో విమానం

Airbus aims to deliver 1 aircraft per week over 10 years in India - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: రానున్న 20 సంవ‌త్స‌రాల్లో ఇండియాలో దాదాపుగా 1750 ప్యాసింజ‌ర్‌, కార్గో ఎయిర్‌క్రాప్ట్‌లు అవ‌స‌ర‌మౌతాయ‌ని యూరోపియన్‌ ఏవియేషన్‌ మేజర్‌ ఎయిర్‌బస్‌   ప్రకటించింది. హైదరాబాద్‌లో  శుక్రవారం నిర్వహించిన ఏవియేష‌న్ షోలో భాగంగా ఇండియా గ్రోత్ రిపోర్ట్‌ను విడుద‌ల చేసింది.  భారత్‌లో విమాన ప్రయాణానికి భారీగా డిమాండ్‌ పుంజుకోనున్న నేపపథ్యంలో రానున్న పదేళ్లలో వారానికి సగటున ఒక విమానాన్ని  పరిచయం చేయనున్నామని ఎయర్‌బెస్‌ ఈ సందర్భంగా   ప్రకటించింది.  

ప్ర‌స్తుతం ఉన్న వృద్దిని అందిపుచ్చుకోవాలంటే 1350 సింగిల్ ఎయిస‌ల్ ఎయిర్ క్రాప్ట్, 430 వైట్ బాడీ ఫ్లైస్ట్స్ కావాల్సి  వ‌స్తుంద‌ని ఎయిర్ బ‌స్ ప్రెసిడెంట్ ఎయిర్  బ‌స్ క‌మ‌ర్షియ‌ల్ ఎయిర్‌ క్రాప్ట్ ఇండియా శ్రీ‌నివాస‌న్  ద్వారకనాథ్‌ తెలిపారు. అంతేకాదు వ‌చ్చే 20 సంవత్స‌రాల్లో దేశీయ విమాన ప్ర‌యాణీకుల సంఖ్య 5 రెట్లు పెరుగుతుంద‌ని ఆయ‌న తెలిపారు. అది ప్ర‌స్తుతం ఉన్న అమెరికా విమాన ప్ర‌యాణీకుల సంఖ్య‌ను మించుతుంద‌ని తెలిపారు.

ఇండియా విమానయాన రంగం ప్ర‌స్తుతం 20శాతం వృద్దిక‌న‌పరుస్తుంద‌ని ఏసియా విమాయ‌న రంగం 9శాతం వృద్ది క‌న‌ప‌రుస్తుంద‌ని ఆయ‌న అన్నారు. ముఖ్యంగా ‘మేక్‌ ఇన్‌ ఇండియా’  పథకం కంపెనీ వ్యూహంలో ప్రధానమైందని ఎయిర్‌బస్‌  పేర్కొంది. ఎయిర్‌బస్‌  సోర్సింగ్ వాల్యూమ్ గత 10 సంవత్సరాలలో 16 రెట్లు పెరిగింది.  ప్రస్తుతం సంవత్సరానికి  550 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉన్నట్టు తెలిపింది. ఈ కంపెనీ ప్రస్తుతం భారతదేశంలో 300 విమానాలను కలిగి ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top