
సాక్షి, న్యూఢిల్లీ: ఒకవైపు ఆధార్ అనుసంధానంపై సుప్రీంకోర్టు మొట్టికాయలేస్తుండగా ఆధార్ అనుసంధానం ప్రయోజనాలపై కేంద్రం సంచలన విషయాలను బహిర్గతం చేసింది. ఆధార్ నెంబర్ అనుసంధానం లెక్కలను రైల్వే శాఖ మంత్రి కోయిల్ పియూష్ గోయల్ శనివారం వెల్లడించారు. ఆధార్ మాండేటరీ చేయడంతో బహిర్గతమైన నకిలీ ఖాతాలు,ఇతర అక్రమాలపై ఏకరువు పెడూతూ సోషల్‌మీడియాలో ఒక వీడియోను షేర్ చేశారు.
ప్రభుత్వం ఆధార్ తప్పనిసరి చేసిన నాటి నుంచి 5 కోట్ల నకిలీ (ఘోస్ట్) ఖాతాలను గుర్తించినట్టు చెప్పారు. 16న్నరకోట్లకుపైగా ఉన్న ఎల్‌పీజీ కనెక్షన్లలో 3.5 అక్రమ ఎల్‌పీజీ కనెక్షన్లుబహిర్గమయ్యాయని, అలాగే 11కోట్ల రేషన్‌కార్డుల్లో 1.6 కోట్ల రేషన్ కార్డులను గుర్తించినట్టు చెప్పారు. మొబైల్ కనెక్షన్లకు ఆధార్ నంబర్ తప్పనిసరిగా లింక్ చేయాలన్న నిబంధనపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీం సీరియస్‌గా స్పందిస్తూ ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. తదుపరి నాలుగు వారాలలో స్పందించాలని ఆదేశించిన నేపథ్యంలో గోయల్ వీడియో ఆసక్తికరంగా మారింది.
కాగా అవినీతిని నిరోధించే వ్యూహం, సెక్యూరిటీ రీత్యా పలు ప్రభుత్వ సంక్షేమ పథకాలతోపాటు, బ్యాంక్, మొబైల్, ప్యాన్, ఎల్‌పీజీ కార్డులకు ఆధార్ నంబర్ అనుసంధానం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే.
Aadhaar Exposes 5 Crore Ghost Accounts: Govt, after making Aadhaar mandatory, has captured fake 3.5 cr LPG connections & 1.6 cr ration cards pic.twitter.com/3hblnbh8yo
— Piyush Goyal (@PiyushGoyal) November 4, 2017