టీసీఎస్‌ నియామకాల్లో 20% విదేశాల్లోనే..

20% of TCS recruitment in abroad - Sakshi

న్యూఢిల్లీ: దేశ ఐటీ దిగ్గజం టీసీఎస్‌ గడిచిన 12 నెలల కాలంలో నియమించుకున్న మొత్తం ఉద్యోగుల్లో 20 శాతం విదేశీయులు కావడం గమనార్హం. వీసా పరమైన సమస్యల నేపథ్యంలో ఐటీ కంపెనీలు విదేశాల్లో నియామకాలపై దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే.

గడిచిన డిసెంబర్‌ త్రైమాసికం వరకే చూసినా టీసీఎస్‌ సుమారు 3,000 మందిని విదేశాల్లో ఉద్యోగులుగా తీసుకుంది. ‘‘మొత్తం మీద గత ఏడాది కాలంలో 59,700 మందిని ఉద్యోగులుగా నియమించుకున్నాం. ఇందులో 1,2700 మంది విదేశాల్లోనే ఉన్నారు.

ఉద్యోగుల్లో స్థానికులకు ప్రాధాన్యం అన్న తమ చొరవ ఏ విధంగా కొనసాగుతుందున్నదానికి ఇదే ప్రతీక’’ అని టీసీఎస్‌ సీఈవో, ఎండీ రాజేష్‌ గోపినాథన్‌ అన్నారు. అయితే, ఏ దేశంలో ఎంత మందిని తీసుకున్నదనే వివరాలను టీసీఎస్‌ బయటకు వెల్లడించలేదు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top