ప్రభుత్వ బ్యాంకులు 12 చాలు!

12 PSU banks almost right for India, says Finance Secretary - Sakshi

ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల మధ్య విలీ నాల ప్రక్రియ దాదాపు పూర్తయినట్టేనని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ వ్యాఖ్యానిం చారు. తాజాగా 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను 4 బ్యాంకులకు కుదిస్తూ విలీన నిర్ణయాన్ని కేంద్రం ప్రకటింన సంగతి తెలిసిందే. నవ భారత ఆకాంక్షలను తీర్చేందుకు ఇప్పుడు మిగలనున్న 12 బ్యాంకులు సరిపోతాయని కుమార్‌ పేర్కొన్నారు. పంజాబ్‌ నేషనన్‌ బ్యాంక్, యూనియన్‌ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్‌ బ్యాంకుల్లో ఆరు బ్యాం కులను విలీనం చేయడంతో దేశంలో మొత్తం ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 2017లో ఉన్న 27 నుంచి ప్రస్తుతం 12కు పరిమితం తగ్గను న్నాయి. దీంతో ప్రపంచస్థాయిలో ఆరు మెగా బ్యాంకులు ఆవిర్భవించనున్నాయి. ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాకారంలో భాగంగానే బ్యాంకుల విలీన నిర్ణయం తీసుకున్నారని కుమార్‌ చెప్పారు. ‘ఆర్థిక వృద్ధి రేటును పరుగులు పెట్టించాలంటే భారీ స్థాయి బ్యాంకులు అవసరం. తాజా మెగా విలీన నిర్ణయం ఈ దిశగా అడుగులు వేయడం కోసమే. భారీ మూలధన నిధులతో మనకు ఇప్పుడు ఆరు మెగా బ్యాంకులు ఉంటాయి’ అని అన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top