గ్రహం అనుగ్రహం (27-11-2019) | Daily Horoscope in Telugu (27-11-2019) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (27-11-2019)

Nov 27 2019 5:37 AM | Updated on Nov 27 2019 5:37 AM

Daily Horoscope in Telugu (27-11-2019) - Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి శు.పాడ్యమి రా.7.44 వరకు తదుపరి విదియ, నక్షత్రం అనూరాధ ఉ.9.24 వరకు తదుపరి జ్యేష్ఠ, వర్జ్యం ప.2.55 నుంచి 4.30 వరకు దుర్ముహూర్తం ప.11.24 నుంచి 12.10 వరకు అమృతఘడియలు... రా.12.54 నుంచి 1.56 వరకు.

సూర్యోదయం :    6.15
సూర్యాస్తమయం    :  5.20
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు

భవిష్యం
మేషం: కళాకారులకు నిరుత్సాహం. ఆర్థిక ఇబ్బందులు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చిక్కులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ దర్శనాలు.
వృషభం: పనులు విజయవంతంగా కొనసాగిస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వస్తులాభాలు. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.
మిథునం: ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు. అందరిలోనూ గౌరవం. విలువైన సమాచారం. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. 
కర్కాటకం: రుణాలు చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు. పనుల్లో జాప్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. దూరప్రయాణాలు. బంధువులతో మాటపట్టింపులు.
సింహం: ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. ఆకస్మిక‡ప్రయాణాలు. అనుకోని ఖర్చులు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. పనులు వాయిదా.  వ్యాపారాలు,ఉద్యోగాలలో మార్పులు.
కన్య: నూతన వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలబ్ధి. విద్యార్థులు సత్తా చాటుకుంటారు.  వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు అనుకూలత. విందువినోదాలు.
తుల: ఆర్థిక లావాదేవీలు సామాన్యం. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం. 
వృశ్చికం: కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. విందువినోదాలు. 
ధనుస్సు: పనుల్లో ఆటంకాలు. వృథా ఖర్చులు. ఆరోగ్యభంగం. బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి  చికాకులు. 
మకరం: శుభకార్యాలలో పాల్గొంటారు. మిత్రులతో సఖ్యత. యత్నకార్యసిద్ధి.  కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూల వాతావరణం. వాహనయోగం.
కుంభం: ఉద్యోగయోగం. కుటుంబంలో శుభకార్యాలు. ఆకస్మిక ధనలబ్ధి. మిత్రులతో వివాదాలు పరిష్కారం. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
మీనం: ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో ప్రతిబంధకాలు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం. దైవదర్శనాలు. 
– సింహంభట్ల సుబ్బారావు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement