గ్రహం అనుగ్రహం (25-11-2019)

Daily Horoscope in Telugu (25-11-2019) - Sakshi

శ్రీ వికారినామ సంవత్సరం. దక్షిణాయనం, శరదృతువు. కార్తీక మాసం. తిథి బ.చతుర్దశి రా.10.26 వరకు, తదుపరి అమావాస్య. నక్షత్రం స్వాతి ఉ.11.09 వరకు, తదుపరి విశాఖ. వర్జ్యం సా.4.29 నుంచి 6.01 వరకు. దుర్ముహూర్తం ప.12.10 నుంచి 12.54 వరకు, తదుపరి ప.2.21 నుంచి 3.05 వరకు. అమృత ఘడియలు రా.1.40 నుంచి 3.12 వరకు

సూర్యోదయం: 6.12 సూర్యాస్తమయం : 5.21
రాహుకాలం :  ఉ.7.30 నుంచి  9.00 వరకు. యమగండం : ఉ.10.30 నుంచి 12.00 వరకు 

భవిష్యం
మేషం: పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తి విషయంలో ఒప్పందాలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.
వృషభం: మిత్రులతో సఖ్యత నెలకొంటుంది. ఆప్తుల సలహాలు పాటిస్తారు. అనుకున్న పనుల్లో విజయం. స్థిరాస్తి వృద్ధి. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.
మిథునం: వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనుకోని ధనవ్యయం. ఆరోగ్యభంగం. విద్యార్థులకు కొంత నిరుత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
కర్కాటకం: పనులు ముందుకు సాగవు. సోదరులతో విభేదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. ఒక సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో కొన్ని మార్పులు.
సింహం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి.
కన్య: కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్య సూచనలు. వ్యాపారాలలో తొందరపాటు వద్దు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు పెరుగుతాయి.
తుల: శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.
వృశ్చికం: సన్నిహితులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. పనులు వాయిదా వేస్తారు. శ్రమ మరింత పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. ఉద్యోగాలలో అవాంతరాలు.
ధనుస్సు: రుణాలు తీరుస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. మీ అంచనాలు నిజమవుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు.
మకరం: వ్యవహారాలలో విజయం. పాతమిత్రులను కలుసుకుంటారు. వాహనాలు, భూములు కొంటారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కుతాయి.
కుంభం: మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొన్ని సమస్యలు. ఆరోగ్యభంగం. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగాలలో మార్పులు అనివార్యం.
మీనం: చేపట్టిన వ్యవహారాలలో అవాంతరా లు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. శ్రమాధిక్యం. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత అనుకూలం.
– సింహంభట్ల సుబ్బారావు 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top