గ్రహం అనుగ్రహం (24-06-2020) | Daily Horoscope in Telugu (24-06-2020) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (24-06-2020)

Jun 24 2020 6:17 AM | Updated on Jun 24 2020 6:17 AM

Daily Horoscope in Telugu (24-06-2020) - Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి శు.తదియ ఉ.10.11 వరకు, తదుపరి చవితి, నక్ష«త్రం పుష్యమి ప.1.40 వరకు తదుపరి ఆశ్లేష, వర్జ్యం రా.2.04 నుంచి 3.38 వరకుదుర్ముహూర్తం ప.11.34 నుంచి 12.28 వరకుఅమృతఘడియలు... ఉ.7.20 నుంచి 8.55 వరకు.

సూర్యోదయం :    5.30
సూర్యాస్తమయం    :  6.34
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు

దినఫలాలు
మేషం:దేవాలయ దర్శనాలు. కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్యసమస్యలు. «ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు మారుμలు.

వృషభం: ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. కార్యజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

మిథునం: కార్యక్రమాలలో అవరోధాలు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. సోదరులు, సన్నిహితులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.

కర్కాటకం: సన్నిహితుల సాయంతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవర్తమానాలు. అదనపు రాబడి. ఆస్తి వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

సింహం: కృషి ఫలించదు. కార్యక్రమాలలో ఆటంకాలు. సోదరులతో విభేదాలు. అనుకోని ప్రయాణాలు. అప్పులు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

కన్య: నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో మీదే పైచేయిగా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. కార్యజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

తుల: పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ప్రముఖుల నుంచి కీలక సందేశం. వస్తులాభాలు, వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

వృశ్చికం: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆదాయం అంతగా కనిపించదు. అప్పులు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

ధనుస్సు: బంధువర్గంతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. ఆరోగ్యసమస్యలు.

మకరం: కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అనుకున్న విధంగా డబ్బు అందుతుంది. విచిత్రమైన సంఘటనలు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో ప్రగతి.

కుంభం: కొత్త పరిచయాలు. అందరిలోనూ ప్రత్యేకత. చర్చలు ఫలిస్తాయి. సోదరుల నుంచి ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. దేవాలయ దర్శనాలు.

మీనం: కుటుంబ, ఆరోగ్యసమస్యలు. వివాదాలు పెరుగుతాయి. దూరప్రయాణాలు. సోదరులు, స్నేహితులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement