గ్రహం అనుగ్రహం (23-11-2019) | Daily Horoscope in Telugu (23-11-2019) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (23-11-2019)

Nov 23 2019 5:20 AM | Updated on Nov 23 2019 8:49 AM

Daily Horoscope in Telugu (23-11-2019) - Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి బ.ద్వాదశి రా.2.23 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం హస్త ప.2.03 వరకు, తదుపరి చిత్త వర్జ్యం రా.9.19 నుంచి 10.58 వరకు దుర్ముహూర్తం ఉ.6.11 నుంచి 7.40 వరకు అమృతఘడియలు... ఉ.8.23 నుంచి 9.48 వరకు.

సూర్యోదయం :    6.11
సూర్యాస్తమయం    :  5.21
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు

భవిష్యం

మేషం: సన్నిహితులతో సఖ్యత. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుం ది. వస్తులాభాలు. కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రగతి కనిపిస్తుంది.

వృషభం: నిర్ణయాలు మార్చుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. దైవదర్శనాలు. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.

మిథునం: వ్యయప్రయాసలు ఉండవచ్చు. అనుకున్న పనుల్లో స్వల్ప అవాంతరాలు. ప్రయాణాలు వాయిదా. శ్రమ తప్పదు. ఉద్యోగయత్నాలు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

కర్కాటకం: శుభకార్యాలలో పాల్గొంటారు. పనులలో విజయం. ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం. వాహన, గృహయోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.

సింహం: వ్యవహారాలలో ప్రతిబంధకాలు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. అనారోగ్యం. బంధువులతో విభేదాలు. విద్యార్థులకు శ్రమ తప్పదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కన్య: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వ్యవహారాలలో పురోగతి. వస్తు, ధనలాభాలు. ఆస్తుల వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

తుల: పనుల్లో అవాంతరాలు. రుణయత్నాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. దూరపు బంధువుల కలయిక. అనారోగ్యం. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

వృశ్చికం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. కొత్త ఉద్యోగాలు దక్కుతాయి. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి.

ధనుస్సు: నిరుద్యోగులకు ఉద్యోగయోగం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

మకరం: చేపట్టిన పనులు ముందుకు సాగవు. బంధుమిత్రులతో వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

కుంభం: శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తుల వివాదాలు. సోదరుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో  కొన్ని మార్పులు.

మీనం: పరిచయాలు పెరుగుతాయి ఆశ్చర్యకరమైన సంఘటనలు. వాహనయోగం. పలుకుబడి పెరుగుతుంది. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు. విందువినోదాలు.

– సింహంభట్ల సుబ్బారావు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement