గ్రహం అనుగ్రహం (22-03-2020) | Daily Horoscope in Telugu (22-03-2020) | Sakshi
Sakshi News home page

Mar 22 2020 5:41 AM | Updated on Mar 22 2020 5:41 AM

Daily Horoscope in Telugu (22-03-2020) - Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, ఉత్తరాయణం శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి బ.త్రయోదశి ఉ.10.03 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం శతభిషం రా.10.18 వరకు తదుపరి పూర్వాభాద్ర, వర్జ్యం తె.5.18 నుంచి 7.04 వరకు (తెల్లవారితే సోమవారం) దుర్ముహూర్తం సా.4.30 నుంచి 5.20 వరకు, అమృతఘడియలు... ప.2.27 నుంచి 4.11 వరకు.

సూర్యోదయం        :  6.07
సూర్యాస్తమయం    :  6.07
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు

భవిష్యం
మేషం: కుటుంబ సౌఖ్యం. విందువినోదాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.  శుభవార్తలు వింటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
వృషభం: శుభకార్యాలలో పాల్గొంటారు. రావలసిన బాకీలు వసూలవుతాయి. నిరుద్యోగులకు అనుకూల సమాచారం. పనులు సజావుగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.
మిథునం: అనుకున్న పనుల్లో అవాంతరాలు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి.  వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ధనవ్యయం.
కర్కాటకం: శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. కొన్ని పనులు శ్రమానంతరం పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ పరుస్తాయి.
సింహం: దూరపు బంధువుల నుంచి ధనలబ్ధి. విందువినోదాలు. పనులు చకచకా పూర్తి చేస్తారు. చిన్ననాటి  మిత్రుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త  హోదాలు.
కన్య: నిరుద్యోగులకు శుభవార్తలు. సమస్యలు కొన్ని తీరి ఊరట చెందుతారు. పనులలో విజయం. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలు ఒత్తిళ్ల నుంచి గట్టెక్కుతారు.
తుల: మిత్రులు, బంధువులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. కుటుంబంలో చికాకులు. ఆలయ దర్శనాలు. పనుల్లో ప్రతిష్ఠంభన. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ పరుస్తాయి.
వృశ్చికం: కొన్ని  పనుల్లో ఆటంకాలు. ధనవ్యయం. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. కళాకారులకు ఒత్తిడులు.
ధనుస్సు: ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆకస్మిక ధనలాభం.  వాహనయోగం. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. విందువినోదాలు.
మకరం: పనులలో ఆటంకాలు. శ్రమాధిక్యం. కొద్దిపాటి  అనారోగ్యం. కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. ప్రయాణాలలో మార్పులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.
కుంభం: విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయం. ఆలోచనలు అమలు చేస్తారు. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు.
మీనం: వ్యయప్రయాసలు. కుటుంబంలో ఒత్తిడులు. అనుకున్న పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు.  దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. బంధువులతో వివాదాలు.
– సింహంభట్ల సుబ్బారావు 

Advertisement
 
Advertisement
Advertisement