గ్రహం అనుగ్రహం (21-11-2019)

Daily Horoscope in Telugu (21-11-2019) - Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి బ.నవమి ఉ.9.23 వరకు, తదుపరి దశమి, నక్షత్రం పుబ్బ సా.5.14 వరకు, తదుపరి ఉత్తర, వర్జ్యం రా.11.54 నుంచి 1.23 వరకు, దుర్ముహూర్తం ఉ.9.54 నుంచి 10.38 వరకు, తదుపరి ప.2.21 నుంచి 3.06 వరకు అమృతఘడియలు... ఉ.11.14 నుంచి 12.44 వరకు.

సూర్యోదయం :    6.11
సూర్యాస్తమయం    :  5.21
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

భవిష్యం
మేషం: ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులు ఒత్తిళ్లు పెంచుతారు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి శ్రమాధిక్యం. ఉద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

వృషభం: కొత్త పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. బంధువులను కలుసుకుంటారు. అనుకోని ప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

మిథునం: పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వాహనాలు కొంటారు. పోటీపరీక్షల్లో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

కర్కాటకం: వ్యవహారాలలో జాప్యం. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. పరిస్థితులు అనుకూలించవు. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

సింహం: కొత్త నిర్ణయాలతో అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సానుకూలత.

కన్య: రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో స్వల్ప వివాదాలు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

తుల: పరిచయాలు పెరుగుతాయి. కొత్త పదవులు దక్కించుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం. విందువినోదాలు.

వృశ్చికం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆస్తిలాభం. నూతన పరిచయాలు. సంఘంలో ఆదరణ. వాహనాలు, ఆభరణాలు కొంటారు. కొన్ని వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

ధనుస్సు: కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో జాప్యం. అనుకోని ప్రయాణాలు. బంధువులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

మకరం: కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆరోగ్యభంగం. చిన్ననాటి మిత్రుల కలయిక. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు.

కుంభం: మిత్రులతో సఖ్యత. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. ఆస్తుల వ్యవహారాలలో సమస్య లు తీరతాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి.

మీనం: వ్యవహారాలలో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలయ దర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది.

– సింహంభట్ల సుబ్బారావు 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top