గ్రహం అనుగ్రహం (21-03-2020)

Daily Horoscope in Telugu (21-03-2020) - Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం, తిథి బ.ద్వాదశి ఉ.8.44 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం ధనిష్ఠ రా.8.14 వరకు, తదుపరి శతభిషం వర్జ్యం తె.3.57 నుంచి 5.44 వరకు (తెల్లవారితే ఆదివారం) దుర్ముహూర్తం ఉ.6.08 నుంచి 7.44 వరకు అమృతఘడియలు... ఉ.9.04 నుంచి 10.33 వరకు.

సూర్యోదయం :    6.08
సూర్యాస్తమయం    :  6.07
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు

భవిష్యం
మేషం: కొత్త పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆహ్వానాలు, గ్రీటింగ్‌లు అందుతాయి. మీ నిర్ణయాలు అందరూ హర్షిస్తారు. నూతన విద్యావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

వృషభం: నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనయోగం. ముఖ్యమైన వ్యవహారాలలో పురోగతి. స్థిరాస్తి లాభం. బంధువర్గంతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

మిథునం: మిత్రులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశాజనకంగా ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నిదానిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

కర్కాటకం: సన్నిహితుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

సింహం: నూతనోత్సాహం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కాంట్రాక్టులు దక్కుతాయి. దైవదర్శనాలు. పనులలో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

కన్య: కొత్త పనులు చేపట్టి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోభివృద్ధి.

తుల: సన్నిహితులు, మిత్రులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. శ్రమాధిక్యం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో స్థాయి పెరుగుతుంది.

వృశ్చికం: ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. కుటుంబంలో ఒత్తిడులు. అనారోగ్యం. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.

ధనుస్సు: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సా హం.

మకరం: కుటుంబంలో ఒత్తిడులు. ఆరోగ్యం మందగిస్తుంది. సన్నిహితులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కుంభం: శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో విశేష గౌరవం. వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

మీనం: మిత్రులు,కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనులు ముందుకు సాగవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.– సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top