గ్రహం అనుగ్రహం (18-11-2019)

Daily Horoscope in Telugu 18-11-019 - Sakshi

శ్రీ వికారినామ సంవత్సరం. దక్షిణాయనం, శరదృతువు. కార్తీక మాసం. తిథి బ.షష్ఠి ప.3.38 వరకు, తదుపరి సప్తమి. నక్షత్రం పుష్యమి రా.9.37 వరకు, తదుపరి ఆశ్లేష. వర్జ్యం ఉ.6.17 నుంచి 7.50 వరకు. దుర్ముహూర్తం ప.12.06 నుంచి 12.51 వరకు, తదుపరి ప.2.21 నుంచి 3.05 వరకు. అమృత ఘడియలు .ప.3.29 నుంచి 5.01 వరకు.

సూర్యోదయం: 6.09 సూర్యాస్తమయం : 5.21
రాహుకాలం :  ఉ.7.30 నుంచి  9.00 వరకు.
యమగండం : ఉ.10.30 నుంచి 12.00 వరకు

భవిష్యం
మేషం: వ్యవహారాలలో ప్రతిబంధకాలు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. విద్యార్థులకు ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

వృషభం: పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల నుంచి విముక్తి.

మిథునం: వ్యవహారాలలో ఆటంకాలు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు.

కర్కాటకం: శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తి లాభం. కొత్త వ్యక్తుల పరిచయం. ఉద్యోగాన్వేషణలో పురోగతి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

సింహం: వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు.

కన్య: పరిస్థితులు అనుకూలిస్తాయి. పాతబాకీలు వసూలవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. నూతన  పరిచయాలు. సంఘంలో గౌరవం. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు.

తుల: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో పురోగతి. విందువినోదాలు. భూములు, వాహనాలు కొంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

వృశ్చికం: మిత్రులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు అంతగా అనుకూలించవు. వ్యయప్రయాసలు. కీలక సమాచారం. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో గందరగోళం.

ధనుస్సు: మిత్రులతో మాటపట్టింపులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పనుల్లో అవాంతరాలు. దూరప్రయాణాలు. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

మకరం: వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

కుంభం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆస్తిలాభం. బంధువులను కలుసుకుంటారు. వ్యవహారాలలో విజయం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుబాటు కాగలవు.

మీనం: వ్యవహారాలలో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. అనారోగ్యం. విద్యార్ధులకు ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు.– సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top