గ్రహం అనుగ్రహం (18-05-2020) | Daily Horoscope in Telugu (18-05-2020) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (18-05-2020)

May 18 2020 7:48 AM | Updated on May 18 2020 8:08 AM

Daily Horoscope in Telugu (18-05-2020) - Sakshi

శ్రీశార్వరినామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం తిథి బ.ఏకాదశి ప.3.24 వరకు తదుపరి ద్వాదశి నక్షత్రం ఉత్తరాభాద్ర సా.5.26 వరకు తదుపరి రేవతి వర్జ్యం. దుర్ముహూర్తం ప.12.22 నుంచి 1.14 వరకు తిరిగి ప.2.55 నుంచి 3.48 వరకు
సూర్యోదయం ఉదయం: 5.31 గంటలు 
సూర్యాస్తమయం: సాయంత్రం 6.21 గంటలు
అమృతఘడియలు....ప.12.09 నుంచి 1.43 వరకు
రాహుకాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు
యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు

గ్రహఫలం
మేషం: ఆసక్తికర సమాచారం. దూరప్రయాణాలు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యస్థితిలో ఉంటాయి.

వృషభం: పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు అందుతుంది. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

మిథునం: సన్నిహితుల సలహాలు స్వీకరిస్తారు. కొత్త పనులు చేపడతారు.ఒక సమాచారం ఊరటనిస్తుంది. ధనలాభం. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

కర్కాటకం: రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

సింహం: ఒక సమాచారం నిరాశ పరుస్తుంది. వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా. శ్రమ తప్పదు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత అసంతృప్తి.

కన్య: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. కుటుంబంలో సఖ్యత. వస్తు, వస్త్రలాభాలు. భూవిక్రయాలలో పురోగతి. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

తుల: పరిచయాలు విస్తరిస్తాయి. కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. బం«ధువులతో సఖ్యత. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ఒత్తిడులు అ«ధిగమిస్తారు.

వృశ్చికం: పనులలో ప్రతిష్ఠంభన. దూరప్రయాణాలు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందికరంగా ఉండవచ్చు.

ధనుస్సు: ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. కొత్త రుణయత్నాలు. పనుల్లో అవాంతరాలు. సోదరులతో మాటపట్టింపులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

మకరం: పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల సలహాల మేరకు నిర్ణయాలు తీసుకుంటారు. వస్తులాభాలు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

కుంభం: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆరోగ్యభంగం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మీనం: కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలత.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement