గ్రహం అనుగ్రహం(15-09-2019) | Daily Horoscope in Telugu (15-09-2019) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం(15-09-2019)

Sep 15 2019 7:37 AM | Updated on Sep 15 2019 8:03 AM

Daily Horoscope in Telugu (15-09-2019) - Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, తిథి బ.పాడ్యమి ఉ.10.25 వరకు, తదుపరి విదియ, నక్షత్రం ఉత్తరాభాద్ర రా.12.57 వరకు, తదుపరి రేవతి, వర్జ్యం ఉ.9.04 నుంచి 10.51 వరకు, దుర్ముహూర్తం సా.4.22 నుంచి 5.11 వరకు, అమృతఘడియలు... రా.7.40 నుంచి 9.23 వరకు.

సూర్యోదయం        :  5.51
సూర్యాస్తమయం    :  6.01
రాహుకాలం :    సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :    ప.12.00 నుంచి 1.30 వరకు 

భవిష్యం : 
మేషం: పనుల్లో ప్రతిష్ఠంభన. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.

వృషభం:  చిత్రవిచిత్ర సంఘటనలు. వస్తులాభాలు. పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక ప్రగతి. కొన్ని వివాదాల పరిష్కారం. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో మరింత అనుకూలత.

మిథునం: పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ముందడుగు.

కర్కాటకం: శ్రమ పెరుగుతుంది. అనుకున్న పనుల్లో ప్రతిష్ఠంభన. ఆస్తి వివాదాలు. విద్యార్థులకు కొంత నిరాశ. ఆరోగ్యభంగం. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో ఆటంకాలు.

సింహం: వ్యవహారాలు మందగిస్తాయి. ఆస్తుల వివాదాలు. సోదరులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. నిర్ణయాలు వాయిదా. వ్యాపారాలలో నిరాశ. ఉద్యోగాలలో ఇబ్బందులు.

కన్య: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

తుల: పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనయోగం. చర్చలు సఫలం. విందువినోదాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

వృశ్చికం: మిత్రులతో వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో మార్పులు.

ధనుస్సు: అనుకున్న పనులు మందకొడిగా సాగుతాయి. మిత్రులు, బంధువులతో మాటపట్టింపులు. ఆలయ దర్శనాలు. శ్రమాధిక్యం. నిర్ణయాలలో మార్పులు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో నిరుత్సాహం.

మకరం: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. వాహనయోగం. భూలాభాలు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. దైవచింతన. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు.

కుంభం: ఆస్తి వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం.

మీనం: చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. ఆహ్వానాలు అందుతాయి. వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో సత్తా చాటుకుంటారు.
– సింహంభట్ల సుబ్బారావు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement