గ్రహం అనుగ్రహం (14-07-2020) | Daily Horoscope in Telugu (14-07-2020) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (14-07-2020)

Jul 14 2020 6:20 AM | Updated on Jul 14 2020 6:20 AM

Daily Horoscope in Telugu (14-07-2020) - Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం, తిథి బ.నవమి రా.6.34 వరకు, తదుపరి దశమి నక్షత్రం అశ్వని ప.1.21 వరకు, తదుపరి భరణి, వర్జ్యం ఉ.8.55  నుంచి 10.41 వరకు, తిరిగి రా.11.56 నుంచి 1.44 వరకు దుర్ముహూర్తం ఉ.8.10 నుంచి 9.04 వరకు, తిరిగి రా.10.57
నుంచి 11.42 వరకు, అమృతఘడియలు... లేవు.

సూర్యోదయం :    5.36
సూర్యాస్తమయం    :  6.35
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు

గ్రహఫలం
మేషం....ప్రయత్నాలు సఫలం. ఇంటిలో సంతోషకర వాతావరణం. రుగ్మతల నుంచి విముక్తి. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగస్తులకు శ్రమ తగ్గుతుంది.

వృషభం...వ్యయప్రయాసలు. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. దైవచింతన. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త చిక్కులు.

మిథునం...పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. భూ,వాహనయోగాలు. ముఖ్య నిర్ణయాలు. శుభవార్తా శ్రవణం. వ్యాపారాలలో ఆశించిన లాభాలు. ఉద్యోగాలలో మరింత అనుకూలత.

కర్కాటకం...ఉద్యోగార్ధులకు శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

సింహం...వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబంలో కొన్ని సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత మందగిస్తాయి.

కన్య...రుణాలు చేస్తారు. కష్టపడ్డా ఫలితం ఉండదు. ఆరోగ్యభంగం. పనుల్లో ప్రతిబంధకాలు. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు జరిగే వీలుంది.

తుల...ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. నూతన ఉద్యోగయోగం. శ్రమ ఫలిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని అభివృద్ధి.

వృశ్చికం...శుభవార్తా శ్రవణం. ధనలాభం. చిన్ననాటి మిత్రుల కలయిక. భూవివాదాలు పరిష్కారం. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

ధనుస్సు....ఆశ్చర్యకరమైన సంఘటనలు. ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. పనులు మధ్యలో వాయిదా వేస్తారు. వ్యాపారాలు కాస్త ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మకరం....శ్రమాధిక్యం. పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. ఆలయ దర్శనాలు.

కుంభం....పనుల్లో పురోగతి. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు. వాహనయోగం. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఉన్నత పోస్టులు.

మీనం...కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. అనుకోని ప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశాజనకంగా ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement