గ్రహం అనుగ్రహం (03-12-2019)

Daily Horoscope in Telugu (03-12-2019) - Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి శు.సప్తమి రా.10.50 వరకు తదుపరి అష్టమి, నక్షత్రం ధనిష్ఠ ప.2.54 వరకు, తదుపరి శతభిషం, వర్జ్యం రా.10.44 నుంచి 12.31 వరకు, దుర్ముహూర్తం ఉ.8.29 నుంచి 9.13 వరకు, తదుపరి రా.10.30 నుంచి 11.22 వరకు, అమృతఘడియలు... లేవు.

సూర్యోదయం :    6.18
సూర్యాస్తమయం    :  5.20
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు

భవిష్యం
మేషం: కొత్త విషయాలు తెలుస్తాయి. శాస్త్రసాంకేతిక విషయాలపై ఆసక్తి చూపుతారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు.
వృషభం: చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి. కుటుంబసభ్యులతో వివాదాలు తీరతాయి. వస్తులాభాలు. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.
మిథునం: మిత్రులతో వివాదాలు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. విద్యార్థులకు శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు వద్దు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి. ఆరోగ్యభంగం.
కర్కాటకం: చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆత్మీయులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. వ్యాపారాలలో ఆచితూచి వ్యవహరించండి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.
సింహం: సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
కన్య: కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. సంఘంలో ప్రత్యేకత చాటుకుంటారు. నూతన విద్యావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.
తుల: కొత్త విషయాలు తెలుస్తాయి. సభలు ,సమావేశాలలో పాల్గొంటారు. పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆరోగ్యభంగం. సన్నిహితులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి ఇబ్బందులు.
వృశ్చికం: ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత సందిగ్ధత.
ధనుస్సు: పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
మకరం: కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యమే. ఉద్యోగాలలో పనిభారం.
కుంభం: మిత్రులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. పనులు చకచకా సాగుతాయి. భూములు, వాహనాలు కొంటారు. వేడుకలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.
మీనం: వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
– సింహంభట్ల సుబ్బారావు 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top