
'2024లో చంద్రబాబు పీఎం.. లోకేష్ సీఎం'
భవిష్యత్తులో టీడీపీ జాతీయ పార్టీగా అవతరిస్తుందని, 2024లో నారా చంద్రబాబునాయుడు దేశ ప్రధానమంత్రి కావడమే కాకుండా, నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారని మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ జోస్యం చెప్పారు.
మచిలీపట్నం : భవిష్యత్తులో టీడీపీ జాతీయ పార్టీగా అవతరిస్తుందని, 2024లో నారా చంద్రబాబునాయుడు దేశ ప్రధానమంత్రి కావడమే కాకుండా, నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారని మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ జోస్యం చెప్పారు. టీడీపీ కృష్ణా జిల్లా విస్తృతస్థాయి సమావేశం ఆదివారం మచిలీపట్నంలో జరిగింది.
నారా లోకేష్‌ను టీడీపీ ప్రధాన కార్యదర్శిగా నియమించాలని ఈ సమావేశంలో తీర్మానం చేయాలని వైవీబీ కోరారు. గుంటూరు, కృష్ణా జిల్లాలకు టీడీపీ అధ్యక్షులుగా వ్యవహరించిన ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కృషిచేసినందునే వారిద్దరు మంత్రులయ్యారన్నారు.