చంద్రబాబు నాయుడు మాటలు విఠలాచార్య మాయలను తలపిస్తున్నాయని పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ వ్యాఖ్యానించారు.
శ్రీకాకుళం : చంద్రబాబు నాయుడు మాటలు విఠలాచార్య మాయలను తలపిస్తున్నాయని పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ వ్యాఖ్యానించారు. బాబు మాయమాటలను తెలుసుకున్న ప్రజలు ...వైఎస్ఆర్ సీపీ చేపట్టిన మహాధర్నాకు స్వచ్ఛందంగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారన్నారు.
మహాధర్నాను అడ్డుకోవడానికి ప్రభుత్వం అడుగడుగునా ప్రయత్నిస్తుందని ప్రయత్నించిందని ... పోలీసుల సాయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అడ్డుకుంటుందని విమర్శించారు. ప్రభుత్వ కుయుక్తులు ఫలించవని కలమట వెంకటరమణ స్పష్టం చేశారు.