క్షతగాత్రుడికి చికిత్స అందించిన ఎమ్మెల్యే శ్రీదేవి

తాడేపల్లి రూరల్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆటో డ్రైవర్‌కు చికిత్స అందించి వైద్యురాలిగా వృత్తి ధర్మాన్ని నిర్వర్తించారు తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి. గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద హైవే సర్వీస్ రోడ్డులో కారు, ఆటో ఢీకొన్నాయి. శనివారం చోటుచేసుకున్న ఈ ఘటనలో ఆటో డ్రైవర్ స్వామి అయ్యప్ప తీవ్రంగా గాయపడ్డాడు. అదే సమయంలో తాడికొండ వెళ్తున్న ఎమ్మెల్యే శ్రీదేవి ఈ ప్రమాదాన్ని గమనించి.. గాయపడిన ఆటో డ్రైవర్‌ను 108 వాహనంలో ఎక్కించి.. సుమారు 20 నిమిషాలపాటు ప్రాథమిక చికిత్స అందించారు. అతడిని 108 వాహనంలో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. ఎమ్మెల్యే తాడేపల్లి పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి ప్రమాద విషయాన్ని తెలియజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి