విజయనగరం జిల్లా బొబ్బిలిలో మంగళవారం అంగన్‌వాడీ కార్యకర్తలు చేపట్టిన దీక్షలకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సుజయరంగారావు మద్దతు ప్రకటించారు.
బొబ్బిలి: విజయనగరం జిల్లా బొబ్బిలిలో మంగళవారం అంగన్‌వాడీ కార్యకర్తలు చేపట్టిన దీక్షలకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సుజయరంగారావు మద్దతు ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యలను తమ పార్టీ తరఫున ప్రస్తావిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
బొబ్బిలిలో ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున అంగన్‌వాడీ కార్యకర్తలు దీక్షలు చేపట్టారు. వేతన పెంపు జీవో వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వారు రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు కొనసాగిస్తున్న విషయం విదితమే.