ఆర్టికల్ 73, 74 ప్రకారం స్థానిక సంస్థలను బలోపేతం చేయాల్సింది పోయి, వాటిని రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని వైఎస్సార్ జిల్లా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు.
'గ్రామస్థాయి రౌడీలతో జన్మభూమి కమిటీలు'
Jan 19 2016 1:25 PM | Updated on Sep 3 2017 3:55 PM
కమలాపురం: ఆర్టికల్ 73, 74 ప్రకారం స్థానిక సంస్థలను బలోపేతం చేయాల్సింది పోయి, వాటిని రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని వైఎస్సార్ జిల్లా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం కమలాపురంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందన్నారు. ఎక్కడా లేని విధంగా స్థానిక ప్రజా ప్రతినిధులను కాదని, జన్మభూమిలో గ్రామస్థాయి రౌడీలను పెట్టి కమిటీ ఏర్పాటు చేయడం అన్యాయమన్నారు. అలా కమిటీ సభ్యులకు అధికారాలు ఇచ్చి వారు చెప్పిన పనులకే ప్రాధాన్యం ఇస్తున్నారని తప్పుబట్టారు. ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల మ్మెల్యేలు, నాయకుల గొంతు నొక్కుతోందని మండిపడ్డారు.
Advertisement


