కశ్మీర్‌లో టీటీడీ వెంకన్న ఆలయం | YSRCP MLA Malladi Vishnu Talks In Vijayawada Meeting Over Kashmir Tourism | Sakshi
Sakshi News home page

‘కశ్మీర్‌లో టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయం’

Mar 2 2020 3:08 PM | Updated on Mar 2 2020 3:50 PM

YSRCP MLA Malladi Vishnu Talks In Vijayawada Meeting Over Kashmir Tourism - Sakshi

సాక్షి, విజయవాడ : కాశ్మీర్‌కు ఆంధ్రప్రదేశ్‌ పర్యటక రంగానికి అనుసంధానం చేయడం శుభపరిణామం అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సోమవారంలో విజయవాడలో జరిగిన జమ్మూకాశ్మీర్‌ టూరిజం, కల్చర్‌ మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ పెట్టుబడులకు అనువైన ప్రాంతమన్నారు. సింగిల్‌ విండొ విధానం ద్వారా టూరిజానికి అన్ని అనుమతులు సులభతరం చేశామని వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం టూరిజానికి పెద్ద పీట వేస్తోందని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్లో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మిస్తున్నట్లు తెలిపారు. కాగా కశ్మీర్ టూరిజానికి రాష్ట్రంలో అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

‘ఆ హక్కు టీడీపీకి లేదు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement