రైల్వే బడ్జెట్ పై వైఎస్సార్సీపీ నిరసన | ysrcp leaders protest on railway budget | Sakshi
Sakshi News home page

రైల్వే బడ్జెట్ పై వైఎస్సార్సీపీ నిరసన

Feb 26 2015 5:56 PM | Updated on May 25 2018 9:20 PM

కేంద్ర రైల్వే బడ్జెట్‌లో విశాఖకు తగిన ప్రాధాన్యత కల్పించలేదని విశాఖపట్నం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ఆరోపించారు.

విశాఖపట్నం (అల్లిపురం): కేంద్ర రైల్వే బడ్జెట్‌లో విశాఖకు తగిన ప్రాధాన్యత కల్పించలేదని విశాఖపట్నం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ఆరోపించారు. గురువారం కేంద్ర మంత్రి సురేష్ ప్రభు ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను నిరసిస్తూ జిల్లా వైఎస్సార్సీపీ నాయకులు జగదాంబసెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడితో పాటు పార్టీ నాయకులు కొయ్య ప్రసాద్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తదితరులు పాల్గొన్నారు. జగదాంబసెంటర్‌లో రాస్తారోకో నిర్వహిస్తున్న నాయకులను పోలీసులు గురువారం సాయంత్రం అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement