జగన్‌ను కలిసిన జిల్లా నేతలు | YSRCP leaders meet to ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

జగన్‌ను కలిసిన జిల్లా నేతలు

Oct 19 2013 7:20 AM | Updated on Aug 21 2018 5:36 PM

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ జిల్లా నేతలు, కార్యకర్తలు పార్టీ జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు, ఖమ్మం పార్లమెంట్ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో...

ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ జిల్లా నేతలు, కార్యకర్తలు పార్టీ జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు, ఖమ్మం పార్లమెంట్ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ పరిస్థితిని జగన్‌కు వివరించినట్లు మచ్చా, పొంగులేటి తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్ చేసే ప్రతిపనికి తాము అండగా ఉంటామన్నారు.
 
 జగన్‌ను కలిసిన వారిలో పినపాక, భద్రాచలం, వైరా, అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గాల కన్వీనర్లు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, బానోత్ మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లు, నంబూరి రామలింగేశ్వరరావు, మట్టాదయానంద్, మధిర నియోజకవర్గ సీనియర్ నాయకులు అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ మెండెం జయరాజు, యువజన విభాగం మూడు జిల్లాల కో-ఆర్డినేటర్ సాధు రమేష్‌రెడ్డి, ఎస్టీ సెల్ జిల్లా కన్వీనర్ భూక్యా దళ్‌సింగ్‌నాయక్, బీసీ సెల్ జిల్లా నాయకులు తోట రామారావు, బీసీ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మార్కం లింగయ్యగౌడ్, కడియం రామాచారి, జిల్లా ట్రేడ్ యూనియన్ కన్వీనర్ సంపెట వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు జక్కం సీతయ్య, చంద్రశేఖర్, రైతుసంఘం జిల్లా కన్వీనర్ మందడపు సత్యనారాయణ, జిల్లా నాయకురాలు కీసర పద్మజారెడ్డి, జమలాపురపు రామకృష్ణ, మంత్రిప్రగడ నరసింహారావు, నగర మహిళా కన్వీనర్ కొత్తకుండ్ల శ్రీలక్ష్మి, రఘునాధపాలెం మండల కన్వీనర్ దుంపటి నగేష్, ఖమ్మం నగర ఉపాధ్యాయ విభాగం కన్వీనర్ షర్మిలా సంపత్, ముదిగొండ మండల కన్వీనర్ మర్రికంటి గురుమూర్తి, నాయకులు గంటా కృష్ణ,, కోయ రేణుక, నల్లా స్వరూపరాణి, అన్నపూర్ణ, మర్రికంటి భాస్కర్, చాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులు కిరణ్ తదితరులు ఉన్నారు.  
 
 టీడీపీ నుంచి వైఎస్‌ఆర్‌సీపీలోకి...
 టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షురాలు మరికంటి ఊర్మిలాగౌడ్ శుక్రవారం హైదారాబాద్‌లో జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement