పాక్‌ అదుపులో ఉన్న  ఉత్తరాంధ్ర జాలర్లను విడిపించండి  | Ysrcp leaders meet Minister Sushma Swaraj for Fishermen missing | Sakshi
Sakshi News home page

పాక్‌ అదుపులో ఉన్న  ఉత్తరాంధ్ర జాలర్లను విడిపించండి 

Dec 14 2018 1:41 AM | Updated on Dec 14 2018 1:41 AM

Ysrcp leaders meet Minister Sushma Swaraj for Fishermen missing - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ అదుపులో ఉన్న 20 మంది ఉత్తరాంధ్ర జాలర్లను విడిపించాలని కోరుతూ కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ విన్నవించింది. ఈమేరకు పార్టీ ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గురువారం మంత్రిని కలిసి వినతిపత్రం అందించారు.

వీరితో పాటు జాలర్ల కుటుంబ సభ్యుడు బర్రి కామయ్య, వైఎస్సార్‌ సీపీ నేతలు వాసుపల్లి అప్పన్న, పతివాడ అప్పలనాయుడు కూడా ఉన్నారు. ఆందోళనలో ఉన్న జాలర్ల కుటుంబాలకు ఊరట కలిగించాలని మంత్రికి విన్నవించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement