
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లాలో రావాలి జగన్..కావాలి జగన్ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది. వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు, సమన్వయ కర్తలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటికీ తిరుగుతూ.. నవరత్నాలతో కలిగే లక్షల రూపాయల లబ్ధిని ప్రజలకు వివరిస్తున్నారు. అంతేకాకుండా టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకుల అవినీతిని ఎండగడుతుండడంతో ప్రజలు ఈ కార్యక్రమంపై ఆసక్తిని కనబరుస్తున్నారు.
శనివారం.. పాణ్యం నియోజకవర్గం కల్లూరు అర్బన్ 28వ వార్డులో శ్రీకృష్ణకాలనీ, విజ్జినగర్లలో ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఆధ్వర్యంలో రావాలి జగన్–కావాలి జగన్ కార్యక్రమాన్ని చేపట్టారు. నాలుగేళ్ల టీడీపీ పాలనలో తమ వార్డులో కనీసం సీసీరోడ్లు, కాలువలు, తాగునీటి సమస్యను పరిష్కరించలేదని పలువురు స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఇంటింటా నవరత్నాలను ప్రచారం చేస్తూ స్థానిక సమస్యలు తెలుసుకోవడానికి ఎమ్మెల్యే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి ఫిరోజ్, వార్డు ఇన్‌చార్జి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
♦ నందికొట్కూరు నియోజకవర్గంలోని పగిడ్యాల మండలం లక్ష్మాపురంలో ఎమ్మెల్యే ఐజయ్య, సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థరెడ్డి రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో పాల్గొని నవరత్నాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ముందుగా గ్రామంలోని వైఎస్‌ఆర్, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం గ్రామంలో ఇళ్లిళ్లు తిరిగి నవరత్నాల కరపత్రాలను పంపిణీ చేశారు.
♦ ఎమ్మిగనూరు పట్టణం 10వ వార్డు పరిదిలోని ముస్లిం, వడ్డేగేరుల్లో నిర్వహించిన రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమంలో పార్టీ నేత ఎర్రకోట జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. స్థానిక సమస్యలు తెలుసుకుంటూ నవరత్నాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో నాయకులు బుట్టా రంగయ్య, ఖాజా, రియాజ్ అహ్మద్, పాల శ్రీనివాసరెడ్డి, సునీల్‌కుమార్, నజీర్‌అహ్మద్ పాల్గొన్నారు.
♦ బనగానపల్లె మండలం పసుపల గ్రామంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటా తిరిగి నవరత్నాల కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు సిద్ధంరెడ్డి రామ్మోహన్‌రెడ్డి, కాటసాని తనయుడు ఓబులురెడ్డి, కాటసాని రమాకాంతరెడ్డి, మాజీ సర్పంచ్ జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు.
♦ కర్నూలులో నిర్వహించిన రావాలి జగన్–కావాలి జగన్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పంద న లభించింది. సమన్వయ కర్త హఫీజ్‌ఖాన్ నేతృత్వంలో అశోకనగర్ పరిసర ప్రాంతాల్లో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు ఇంటింటా తిరిగి నవరత్నా ల కరపత్రాలను పంపిణీ చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కాగానే సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, రాజావిష్ణువర్ధన్‌రెడ్డి, మద్దయ్య, రెహమాన్ పాల్గొన్నారు.