తక్షణమే స్పందించిన వైఎస్సార్‌సీపీ నేతలు

YSRCP leaders immediately responded on boat accident issue - Sakshi

సాక్షి, అమరావతి బ్యూరో: కృష్ణా నదిలో బోటు ప్రమాదానికి గురైతే ప్రభుత్వ యంత్రాంగం నుంచి తక్షణ స్పందన కరువైంది. వైఎస్సార్‌సీపీ నేతలు కొలుసు పార్థసారథి, జోగి రమేష్, ఉదయభాను తమ అనుచరులతో కలసి పది నిమిషాల్లోనే ప్రమాద స్థలికి చేరుకున్నారు. అప్పటికి అధికారులు, రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకోలేదు. వైఎస్సార్‌సీపీ నేతలే స్థానికులతో కలసి సహాయక చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లను పిలిపించి నదిలోకి పంపించారు. బోల్తా పడిన బోటు కింద పర్యాటకులు ఉన్నారని వైఎస్సార్‌సీపీ నేతలు గుర్తించారు.

బోటును కొంతమేర పగుల కొట్టి నీటిలో ఉన్న పర్యాటకులను గుర్తించి ఒడ్డుకు చేర్చారు. అనంతరం రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయి. నీట మునిగి ఉన్న మరికొందరు పర్యాటకులను బయటకు తీశాయి. అంబులెన్స్‌ల రాక ఆలస్యం కావడంతో బాధితులను ఆటోల్లోనే ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. ఘటన జరిగి దాదాపు 45 నిమిషాలయ్యాక వచ్చిన పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్న వైఎస్సార్‌సీపీ నేతలపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. వైఎస్సార్‌సీపీ నేతలు అక్కడే ఉంటే ప్రభుత్వ వైఫల్యం బయటపడుతుందనే ఉద్దేశంతో వైఎస్సార్‌సీపీ నేతలను నెట్టివేసేందుకు ప్రయత్నించారు.

Advertisement
Advertisement
Back to Top