కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలోని ఎర్రకాల్వ పక్కన ఏడేళ్ల నుంచి నివాసం ఉంటున్నవారిని తక్షణం ఖాళీ చేయాలని పేదలకు నోటీసులు ఇవ్వడం సరికాదని వైఎస్‌ఆర్‌సీపీ నేత సామినేని ఉదయభాను పేర్కొన్నారు.
జగ్గయ్యపేట (కృష్ణాజిల్లా) : కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలోని ఎర్రకాల్వ పక్కన ఏడేళ్ల నుంచి నివాసం ఉంటున్నవారిని తక్షణం ఖాళీ చేయాలని పేదలకు నోటీసులు ఇవ్వడం సరికాదని వైఎస్‌ఆర్‌సీపీ నేత సామినేని ఉదయభాను పేర్కొన్నారు. ఎర్రకాల్వ పక్కన నివసిస్తున్న 257 మందికి.. వారం రోజుల్లో అక్కడి నుంచి ఖాళీ చేయాలని ప్రభుత్వం నుంచి నోటీసులు అందాయి. నోటీసులు అందుకున్నవారు భయాందోళన చెందుతున్నారు.
ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్న తమను వెళ్లిపోవాలనటం సరికాదన్నారు. ప్రభుత్వం పేదలపై ప్రతాపం చూపడం మంచిది కాదన్నారు. ఈ నేపథ్యంలో జగ్గయ్యపేట వైఎస్‌ఆర్‌సీపీ నేత సామినేని ఉదయభాను గురువారం ఎర్రకాల్వ నివాసులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నోటీసులపై ప్రభుత్వం పునరాలోచించాలని, లేకుంటూ వారి తరఫున ఉద్యమిస్తామన్నారు.