‘పచ్చచొక్కా వేసుకుంటేనే ఉద్యోగాలా?’ | YSRCP Leader Gowtham Reddy Fires on Chandrababu | Sakshi
Sakshi News home page

‘పచ్చచొక్కా వేసుకుంటేనే ఉద్యోగాలా?’

Jun 15 2018 4:48 PM | Updated on Aug 20 2018 6:07 PM

YSRCP Leader Gowtham Reddy Fires on Chandrababu - Sakshi

గౌతమ్‌రెడ్డి

సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్మికుల్లో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ట్రేడ్‌ యూనియన్‌ నేత గౌతమ్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని విమర్శించారు. కార్మికులకు సరైన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగులను ఎందుకు రెగ్యులర్‌ చేయడం లేదని ప్రశ్నించారు. 

గతంలో ఐకేపీ ఉద్యోగులను, ఆదర్శ రైతులను ఎందుకు తొలగించారని గౌతమ్‌ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పచ్చ చొక్కాలు వేసుకుంటేనే ఉద్యోగాలు ఇస్తారా అని మండిపడ్డారు. ప్రభుత్వం ఉద్యోగులకు వేతనాలు పెంచమంటే నాటకాలు ఆడుతోందని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement