గౌరు వెంకటరెడ్డి నామినేషన్‌ దాఖలు | ysrcp leader gowru venkatareddy files nomination papers for localbody MLC polls | Sakshi
Sakshi News home page

గౌరు వెంకటరెడ్డి నామినేషన్‌ దాఖలు

Feb 27 2017 1:16 PM | Updated on Sep 5 2017 4:46 AM

గౌరు వెంకటరెడ్డి నామినేషన్‌ దాఖలు

గౌరు వెంకటరెడ్డి నామినేషన్‌ దాఖలు

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు.

కర్నూలు : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఐజయ్య, గౌరు చరిత, బాలనాగిరెడ్డి, సాయిప్రసాద్‌ రెడ్డి, పార్టీ నేతలు గంగుల ప్రభాకర్‌ రెడ్డి, కాటసాని రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వాస్తవానికి కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో వైఎస్‌ఆర్‌ సీపీ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉంది. కాగా అధికారపార్టీ నుంచి ఇప్పటివరకూ అభ్యర్థి ఖరారు కాలేదు. మరోవైపు నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల కోటా మండలి ఎన్నికలకు వైఎస్‌ఆర్‌ సీపీ అభ్యర్థిగా ఆనం విజయకుమార్‌రెడ్డి పేరు ఖరారు అయింది.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement