
సాక్షి, గూడూరు (ప్రకాశం): ఎన్నికల ప్రచారంలో స్థానికులతో మమేకం కావడానికి పార్టీ నేతలు చిత్రవిచిత్ర శైలితో ఆకట్టుకుంటున్నారు. గూడూరు అసెంబ్లీ స్థానానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెలగపల్లి వరప్రసాద్‌రావు తరఫున గూడూరు పట్టణంలోని 3వ వార్డు పరిధి జనార్దన్‌రెడ్డి కాలనీలో మున్సిపల్ చైర్‌పర్సన్ పొణకా దేవసేనమ్మ ప్రచారం నిర్వహించారు. అక్కడే తోపుడు బండిపై దోసెలు వేస్తున్న వారితో మాటలు కలిపారు. రోజుకు రాబడి ఎంత వస్తుందంటూ దుకాణం యజమానితో మాట్లాడారు. ఇదే సమయంలో నేను దోసెలు పోస్తానంటూ దేవసేనమ్మ దోసెలు పోస్తూ.. ఎవరికి ఏ దోసెలు కావాలో అంటూ పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. పలు రకాలు దోసెలు పోసిచ్చారు.