
శిక్షణ తరగతుల్లో మాట్లాడుతున్న సమన్వయకర్త విజయనిర్మల
పీఎంపాలెం: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చడంలో విఫలమైన అధికార టీడీపీని మట్టికరిపించడానికి బూత్ కన్వీ నర్లు, సభ్యులు క్రమశిక్షణ కలిగిన సైనికుల్లా పని చేయాలని భీమిలి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయ కర్త అక్కరమాని విజయనిర్మల పిలు పునిచ్చారు. ఆదివారం శిల్పారామంలో ఆ పార్టీ 4,5,6 వార్డుల బూత్ కమిటీలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజ ల ఉన్నతికోసం ప్రకటించిన నవరత్నాలును ప్రతి గడçపకు తీసుకెళ్లాలని సూచించారు. అలాగే వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. మహానేత వైఎస్ పాలన జగన్‌తోనే సాధ్యమనే విషయం ప్రజలకు అర్థమయ్యేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
5 వార్డు అధ్యక్షుడు పోతిన శ్రీనివాసరావు మాట్లాడుతూ వార్డులోని బూత్‌లకు చెందిన ఓట ర్లను కలసి వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే అమలు చేయనున్న పథకాలను వివరించాలన్నారు. పార్లమెంట్ బూత్ కమిటీ ఇన్‌చార్జి కిషోర్ మాట్లాడుతూ పార్టీకి జవసత్వాలు బూత్ కమిటీలే అన్నా రు. బూత్ కమిటీల విధులు బాధ్యతల గురించి సోదాహరణంగా వివరించారు. స్థానిక నాయకుడు పీవీజీ అప్పారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాలుగో వార్డు అధ్యక్షులు గాదె రోశిరెడ్డి , ఆరోవార్డు అధ్యక్షుడు లొడగల రామ్మోహన్, భీమిలి బూత్‌కమిటీ ఇన్‌చార్జి బి.రాజ్‌కుమార్,అన్నం వెంకటేశ్వర్లు , మహిళా విభాగం అధ్యక్షులు ధర్మాల సుజాత,ఎం.రాజేశ్వరి,కృపాజ్యోతి,పార్టీ స్టేట్ యూత్ సెక్రటరీ నల్లా రవికుమార్, సీనియర్ నాయకులు జేఎస్‌రెడ్డి , గుమ్మడి మధు, రాయిన సాయికుమార్, శివశంకరరెడ్డి పాల్గొన్నారు.

హాజరైన 4,5,6 వార్డుల బూత్ కమిటీల కన్వీనర్లు , సభ్యులు