అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల హత్యలపై ఆపార్టీ లీగల్ సెల్ కన్వీనర్ నారాయణరెడ్డి మంగళవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు.
హైదరాబాద్ : అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల హత్యలపై ఆపార్టీ లీగల్ సెల్ కన్వీనర్ నారాయణరెడ్డి మంగళవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. జిల్లాలో కొనసాగుతున్న రాజకీయ హత్యలపై విచారణ చేయించాలని ఆయన తన పిటిషన్లో కోరారు. భూమిరెడ్డి శివప్రసాదరెడ్డి హత్యకేసు నిందితులను వదిలేసి వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై బనాయిస్తున్న అక్రమ కేసులను పరిశీలించాలని నారాయణరెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.