కవ్వింపు చర్యలను సహించం | YSR congress party given strong comments for TDP party | Sakshi
Sakshi News home page

కవ్వింపు చర్యలను సహించం

May 19 2014 2:58 AM | Updated on Oct 20 2018 6:17 PM

అధికారం ఉంది కదా అని టీడీపీ దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తే సహించేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్ హెచ్చరించారు. కవ్వింపు చర్యలకు దిగి వైఎస్సార్‌సీపీ కార్యకర్తల సహనాన్ని పరీక్షించవద్దన్నారు.

సాక్షి, నెల్లూరు: అధికారం ఉంది కదా అని టీడీపీ దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తే సహించేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్  హెచ్చరించారు. కవ్వింపు చర్యలకు దిగి వైఎస్సార్‌సీపీ కార్యకర్తల  సహనాన్ని పరీక్షించవద్దన్నారు. స్థానిక
 
 నెల్లూరు (టౌన్), చిట్టమూరు, న్యూస్‌లైన్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల లెక్కింపు  విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు అధికారులపై వేటుపడింది. చిట్టమూరు ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్, కార్యాలయం సూపరింటెండెంట్ జ్ఞానానందం, విస్తరణాధికారి(ఈవోపీఆర్డీ) వీరబ్రహ్మంలను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ శ్రీకాంత్ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాక రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన ఉద్యానశాఖ ఏడీ సుబ్బారెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్‌లోని ఆశాఖ కమిషనర్‌కునివేదిక పంపారు.
 
 ఈయనపై కూడా ఒకటి రెండు రోజుల్లో చర్యలు తీసుకునే అవకాశం ఉందని కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి. గతనెలలో ఎంపీటీసీ , జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలను ప్రకటించేందుకు ఈనెల 13వ తేదీన కౌంటింగ్ జరిగింది. అయితే ఇక్కడ ఒక కట్టకు సంబందించి ఓట్లను లెక్కించకుండానే అధికారులు ఫలితాలు ప్రకటించేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. వెయ్యిఓట్లు లెక్కించలేదని ప్రచారం జరుగుతోంది. ఈవిషయమై సంబంధిత అధికారులపై చర్యలు చేపట్టాలంటూ ఈనెల 15వ తేదీన కలెక్టర్‌కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అధికారులు కావాలనే పక్షపాతంతో తమకు అన్యాయం చేశారని ఆరోపించారు. లెక్కింపు సమయంలో ఎంపీడీఓ ఏక పక్షంగా వ్యవహరించారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు.  కలెక్టర్ వెంటనే ఏజే సీని విచారణకు ఆదేశించారు.
 
 ఆయన పరిశీలించి శనివారం కలెక్టర్‌కు నివేదిక పంపారు. అధికారులు విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించారని, ఓట్లు లెక్కింపులో చిన్నపొరపాటు వల్ల ఒక కట్టను పక్కన పెట్టి మరిచి పోయారని ఎన్నికల సిబ్బంది ఏజేసీ రాజ్‌కుమార్‌కు వివరించినట్టు తెలిసింది. ఇది కావాలని చేయలేదని, పొరపాటున జరిగిందని అధికారులు ఏజేసీ వద్ద వాపోయినట్టు సమాచారం. పరిశీలించిన ఏజేసీ మాత్రం ఎన్నికల విధుల్లో సిబ్బంది అత్యంత నిర్లక్ష్యం ప్రదర్శించారని నివేదికలో పేర్కొన్నారు. దీనిని ఆధారంగా కలెక్టర్ వెంటనే ఆ అధికారులపై వేటు వేశారు.     
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement