తండ్రి హత్యపై వైఎస్‌ సునీత ఫిర్యాదు | YS Vivekananda Reddy Daughter Files Case In Pulivendula PS On His Death | Sakshi
Sakshi News home page

వివేకానందరెడ్డి హత్యపై వైఎస్‌ సునీత ఫిర్యాదు

Mar 15 2019 5:36 PM | Updated on Mar 15 2019 6:08 PM

YS Vivekananda Reddy Daughter Files Case In Pulivendula PS On His Death - Sakshi

మా నాన్న రాజకీయాల్లో రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటారు : వైఎస్‌ సునీత

సాక్షి, పులివెందుల : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యపై ఆయన కుమార్తె వైఎస్‌ సునీత పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోదరుడు వైఎస్‌ అవినాశ్‌ రెడ్డితో కలిసి పులివెందుల పీఎస్‌కు వచ్చిన ఆమె... తన తండ్రి హత్యపై లోతుగా విచారణ జరిపించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం వైఎస్‌ సునీత మాట్లాడుతూ.. ‘మా నాన్న రాజకీయాల్లో రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఆయన ప్రచారం చేస్తున్నారు. మా నాన్న ప్రచారాన్ని అడ్డుకునేందుకే ప్రత్యర్థులు కుట్ర పన్ని ఆయనను హత్య చేశారని అనుమానిస్తున్నాం’ అని పేర్కొన్నారు.

వైఎస్‌ వివేకానందరెడ్డిది హత్యే!

కాగా అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వైఎస్‌ వివేకానందరెడ్డిది హత్యేనని పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదికలో వెల్లడైన సంగతి తెలిసిందే. ఆయన శరీరంపై ఏడు కత్తి గాయాలు ఉన్నాయని వైద్యులు తమ నివేదికలో పేర్కొన్నారు. పదునైన ఆయుధంతో వైఎస్‌ వివేకానందరెడ్డి తల, శరీరంపై ఏడుసార్లు దాడి చేసినట్లు గుర్తించారు. నుదుటిపై లోతైన రెండు గాయాలు, తల వెనక భాగంలో మరో గాయం, తొడ భాగం, చేతిపైనా మరో గాయం అయినట్లు తెలుస్తోంది. ఇక వైఎస్‌ వివేకానంద రెడ్డి హఠాన్మరణంపై ఆయన పీఏ కృష్ణారెడ్డి కూడా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.(వైఎస్‌ వివేకానందరెడ్డి మృతి హత్య కేసుగా నమోదు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement