వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదలకు సంబంధఙంచిన జామీను పత్రాలను సమర్పించేందుకు ఆయన తరపు న్యాయవాదులు మంగళశారం ఉదయం నాంపల్లి సీబీఐ కోర్టుకు చేరుకున్నారు.
హైదరాబాద్ : వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదలకు సంబంధఙంచిన జామీను పత్రాలను సమర్పించేందుకు ఆయన తరపు న్యాయవాదులు మంగళశారం ఉదయం నాంపల్లి సీబీఐ కోర్టుకు చేరుకున్నారు. జామీను పత్రాలు పరిశీలించి విడుదల ఆర్డర్స్ను కోర్టు ఇవ్వనుంది. కోర్టు ప్రక్రియ ముగిసేసరికి రెండు గంటల సమయం పట్టనుంది.
ప్రస్తుతం నాంపల్లి కోర్టు ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది. కోర్టు ఆర్డర్స్ ...చంచలగూడ జైలు అధికారులకు అందగానే ....జగన్ విడుదల కానున్నారు. నాంపల్లి సీబీఐ కోర్టు జగన్ కు బెయిల్ మంజూరు చేస్తూ ఇద్దరు జామీన్‌దారులు రెండు లక్షల పూచీకత్తులను సమర్పించాలని ఆదేశించిన విషయం తెలిసిందే.