వైఎస్ జగన్మోహన్ రెడ్డి రిమాండ్ను సెప్టెంబర్ 6వ తేదీవరకూ పొడిగిస్తూ నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్ : వైఎస్ జగన్మోహన్ రెడ్డి రిమాండ్ను సెప్టెంబర్ 6వ తేదీవరకూ పొడిగిస్తూ నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనతో పాటు మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ, నిమ్మగడ్డ ప్రసాద్, కేవీ బ్రహ్మానందరెడ్డి, విజయసాయి రెడ్డిలకు కూడా న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. చంచల్‌గూడ జైలులో ఉన్న వీరందరినీ సీబీఐ కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపింది.
మరోవైపు ఒఎంసీ కేసులో గనుల శాఖ మాజీ ఎండీ రాజగోపాల్ సోమవారం సీబీఐ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. కాగా ఐఏఎస్ అధికారణి శ్రీలక్ష్మి అనారోగ్య కారణంగా కోర్టుకు హాజరు కాలేకపోతున్నట్లు ఆమె తరపు న్యాయవాదులు మెడికల్ రిపోర్టును సమర్పించారు. కాగా జగన్ పెట్టుబడుల కేసులో విచారణ నిమిత్తం మాజీమంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి సోమవారం సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. వారు తమ వాదనలను కోర్టుకు తెలియచేశారు.