అంబేద్కర్‌ బాటలో నడుద్దాం: వైఎస్‌ జగన్‌ | ys jagan mohan reddy tributes to babasaheb ambedkar | Sakshi
Sakshi News home page

అంబేద్కర్‌ బాటలో నడుద్దాం: వైఎస్‌ జగన్‌

Apr 14 2017 11:05 AM | Updated on Jul 25 2018 4:42 PM

అంబేద్కర్‌ బాటలో నడుద్దాం: వైఎస్‌ జగన్‌ - Sakshi

అంబేద్కర్‌ బాటలో నడుద్దాం: వైఎస్‌ జగన్‌

బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ చూపిన బాటలో నడవాలని వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు.

హైదరాబాద్‌: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ చూపిన బాటలో నడవాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ 126వ జయంతి సందర్భంగా ఆయనకు జగన్‌ నివాళి అర్పించారు.

'డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పిస్తున్నాను. ఆయన చూపిన బాటలో మనమంతా నడవాలి. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకునేందుకు మనమందరం పయత్నించాల'ని జగన్‌ ట్వీట్‌ చేశారు. వైఎస్సార్‌ జిల్లా పర్యటనలో ఉన్న జగన్‌ శుక్రవారం ఉదయం పులివెందులలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement