Babasaheb Ambedkar jayanthi
-
అంబేద్కర్‌కు ఏపీ గవర్నర్ ఘన నివాళి
సాక్షి, విజయవాడ: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళవారం విజయవాడలోని రాజ్‌భవన్ దర్బార్‌హాల్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగాన్ని రూపుదిద్దిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌కు యావత్ భారతదేశం కృతజ్ఞతలు తెలుపుతోంది. గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడిగా, పేదల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన నాయకుడిగా ఆయన దేశ ప్రజల హృదయాల్లో స్థిరస్థాయిగా ఉంటారని' పేర్కొన్నారు. కార్యక్రమంలో రాజ్‌భవన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కాగా.. కరోనా నేపథ్యంలో అతి నిరాడంబరంగా, సామాజిక దూరాన్ని పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం. చదవండి: అంబేడ్కర్‌కు సీఎం జగన్ ఘన నివాళి -
మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకం: వెంకయ్య
హైదరాబాద్: బీజేపీ వెనుకబడినవాళ్లకు రిజర్వేషన్ల కల్పనకు అనుకూలమేనని, మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. బీజేపీ కార్యాలయంలో జరిగిన అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో ఆయన పాల్గొన్నారు. మతపరమైన రిజర్వేషన్లు సామాజిక అశాంతికి దారి తీస్తాయని, వివిధ వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడుతుందని, వాటిని రాజ్యాంగం ఒప్పుకోదని చెప్పారు. అసమానతలను, కులవివక్షను అంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏ పార్టీ కూడా అంబేద్కర్ ఆలోచనలను వ్యతిరేకించలేదని, సామాజిక అసమానతలు సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. మత మార్పిడి వివక్షకు సమాధానం కాదన్నారు. అంబేద్కర్ కాంగ్రెస్‌కు రుచించలేదని, కాంగ్రెస్ ఎప్పుడూ అంబేద్కర్‌ను సమర్దించలేదంటూ అంబేద్కర్ చిత్రపటాన్ని పార్లమెంట్లో పెట్టడానికి 50 ఏళ్ళు పట్టిందని, భారత రత్న ఇవ్వడానికి 30 ఏళ్ళు పట్టిందని విమర్శించారు. మరో కేంద్ర మంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ అంబేద్కర్ అణగారినవర్గాలకు ఆశాజ్యోతి అని కొనియాడారు. సామాజికంగా అసమానతలు లేని వాళ్లకు రిజర్వేషన్లు ఇవ్వొద్దని అంబేద్కర్ చెప్పారంటూ మోడీ అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తున్నారని చెప్పారు. అంబేద్కర్ ఆలోచనలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే బీజేపీ గట్టిగా పోరాడతుందన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ గత పాలకులు దళితులను ఓటర్లుగానే చూశారని, మోడీ సర్కారు మూడేళ్ల పాలన అవినీతి రహితంగా సాగుతోందని చెప్పారు. మంద కృష్ణ ఉద్యమానికి బీజేపీ మద్దతు ఇస్తుందన్నారు. అంబేద్కర్ ఆశయాలకు తెలంగాణ సర్కార్ తూట్లు పొడుస్తోందన్నారు. -
చిన్నరాష్ట్రాల స్ఫూర్తి ప్రదాత
హైదరాబాద్: చిన్న రాష్ట్రాల స్ఫూర్తి ప్రదాత అంబేద్కరని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. రాజ్యంగా నిర్మాత బీ.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం ఉధృతం అయిన తర్వాత అంబేద్కర్ తెలంగాణలో ప్రతీ ఇంటికి పరిచయం అయ్యారు. ఆయన బలమైన ప్రజాస్వామిక వాది. సమాజంలో అసమానతలు ఉండకూడదని ఆయన కోరుకున్నారు. దేశానికి స్వతంత్రం వచ్చింది కానీ రాజకీయ, సామాజిక, ఆర్థిక సమానతలు మాత్రం రాలేదు. అందుకోసం అంబేద్కర్ స్ఫూర్తితో తెచ్చుకున్న తెలంగాణను సామాజిక తెలంగాణగా మార్చుకునే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు -
అంబేద్కర్ బాటలో నడుద్దాం: వైఎస్ జగన్
-
అంబేద్కర్ బాటలో నడుద్దాం: వైఎస్ జగన్
హైదరాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన బాటలో నడవాలని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 126వ జయంతి సందర్భంగా ఆయనకు జగన్ నివాళి అర్పించారు. 'డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పిస్తున్నాను. ఆయన చూపిన బాటలో మనమంతా నడవాలి. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకునేందుకు మనమందరం పయత్నించాల'ని జగన్ ట్వీట్ చేశారు. వైఎస్సార్ జిల్లా పర్యటనలో ఉన్న జగన్ శుక్రవారం ఉదయం పులివెందులలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.