చిన్న రాష్ట్రాల స్ఫూర్తి ప్రదాత అంబేద్కరని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు.
చిన్నరాష్ట్రాల స్ఫూర్తి ప్రదాత
Apr 14 2017 1:55 PM | Updated on Jul 29 2019 2:51 PM
హైదరాబాద్: చిన్న రాష్ట్రాల స్ఫూర్తి ప్రదాత అంబేద్కరని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. రాజ్యంగా నిర్మాత బీ.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం ఉధృతం అయిన తర్వాత అంబేద్కర్ తెలంగాణలో ప్రతీ ఇంటికి పరిచయం అయ్యారు. ఆయన బలమైన ప్రజాస్వామిక వాది. సమాజంలో అసమానతలు ఉండకూడదని ఆయన కోరుకున్నారు. దేశానికి స్వతంత్రం వచ్చింది కానీ రాజకీయ, సామాజిక, ఆర్థిక సమానతలు మాత్రం రాలేదు. అందుకోసం అంబేద్కర్ స్ఫూర్తితో తెచ్చుకున్న తెలంగాణను సామాజిక తెలంగాణగా మార్చుకునే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు
Advertisement
Advertisement