ఒక అంశానికి ఎన్నిసార్లు శిక్ష వేస్తారు? | YS Jagan Mohan Reddy direct question to government | Sakshi
Sakshi News home page

ఒక అంశానికి ఎన్నిసార్లు శిక్ష వేస్తారు?

Mar 8 2017 2:49 AM | Updated on Oct 29 2018 8:10 PM

ఒక అంశానికి ఎన్నిసార్లు శిక్ష వేస్తారు? - Sakshi

ఒక అంశానికి ఎన్నిసార్లు శిక్ష వేస్తారు?

తమ శాసనసభ్యురాలు ఆర్‌.కె.రోజాను ఎన్నిసార్లు శిక్షిస్తారని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సూటిగా ప్రశ్నించారు.

రోజా వ్యవహారంపై జగన్‌ సూటి ప్రశ్న

సాక్షి, అమరావతి: తమ శాసనసభ్యురాలు ఆర్‌.కె.రోజాను ఎన్నిసార్లు శిక్షిస్తారని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. మంగళవారం అసెంబ్లీ వాయిదా పడిన తరువాత లాబీల్లో విలేకరులు ‘రోజాను మళ్లీ సస్పెండ్‌ చేయాలని అధికారపక్షం అంటోది... కదా!’ అని జగన్‌ వద్ద ప్రస్తావించినపుడు  ‘ఆమెను ఇప్పటికే ఒక ఏడాది పాటు సస్పెండ్‌ చేసి సభకు రాకుండా చేశారు.  ఏడాది శిక్షాకాలం పూర్తయి కూడా ఆరు నెలలు దాటింది కూడా... మళ్లీ ఇపుడు కొత్త దానికి శిక్ష అంటున్నారు. ఇలా ఎన్నిసార్లు శిక్షి స్తారు... ఒక ఆడపడుచును, మహిళా ఎమ్మెల్యేను ఇలా శిక్షించాలని చూడ్డం ధర్మమేనా?’ అని జగన్‌ వ్యాఖ్యానించారు.

ఏదైనా కేసులో జీవితౖ ఖెదు విధించిన వారికి కూడా పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని శిక్షాకాలాన్ని తగ్గిస్తారని, అలాంటిది ఏడాది పాటు సస్పెన్షన్‌ కాలం పూర్తయిన తరువాత మళ్లీ శిక్షిస్తామనడం ఎక్కడైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు. కాల్‌మనీ సెక్స్‌ కుంభకోణంపై ఆరోజు సభలో తామంతా మాట్లాడామని, రోజా చివర్లో మాట్లాడారని జగన్‌ అన్నారు. రెండు హత్యలకు శిక్ష వేసినపుడు ఆ శిక్షా కాలం పూర్తయిన తరువాత, మళ్లీ రెండో హత్యకు కూడా శిక్ష అనుభవించాలని అన్నట్లుగా ఉందని జగన్‌ అన్నారు. అధికారపక్షం చూపిస్తున్న వీడియోలు తప్పని, అవి ఒరిజినల్‌ కావని రోజా చెబుతున్నా ఆ విషయంలో ఎందుకు స్పందించడం లేదని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. 

Advertisement
 
Advertisement
Advertisement