నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశీస్సులు | YS Jagan mohan reddy blesses newly married couple at Visakha | Sakshi
Sakshi News home page

నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశీస్సులు

Apr 27 2019 7:59 PM | Updated on Jul 12 2019 3:10 PM

YS Jagan mohan reddy blesses newly married couple at Visakha - Sakshi

సాక్షి, విశాఖ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ సోదరుడి కుమార్తె వివాహానికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన నూతన వధూవరులను ఆశీర్వదించారు. బొత్స సోదరుడు, గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య కుమార్తె యామిని వివాహం విశాఖకు చెందిన రవితేజతో జరిగింది. రుషికొండలోని సాయిప్రియా రిసార్ట్స్‌లో జరిగిన ఈ వేడుకకు వైఎస్ జగన్‌ హాజరై నూతన జంటకు ఆశీస్సులు అందించారు.

ఈ వేడుకలో వైఎస్‌ జగన్‌తో పాటు ఎంపీ విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, అవంతి శ్రీనివాస్‌, వంశీకృష్ణ శ్రీనివాస్‌, ఎంపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ, మళ్ల విజయ ప్రసాద్‌, గుడివాడ అమర్నాథ్‌, అదీప్‌ రాజ్‌, చెట్టి ఫాల్గుణ, బూడి ముత్యాలనాయుడు, గొట్టేటి మాధవి,  కుంభ రవిబాబు, ద్రోణంరాజు శ్రీనివాస్, కేకే రాజు, రొంగలి జగన్నాధం, కొండా రాజీవ్‌, పుష్పశ్రీ వాణి, రాజశ్రీ, అంబటి రాంబాబు, కొట్టగుళ్ల భాగ్యలక్ష్మి, కిల్లి కృపారాణి, వరుదు కల్యాణి, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement