సీఎం జగన్‌ ఉదారత.. దివ్యాంగుడికి ఆర్థిక సాయం

YS Jagan Help A Handicapped Person - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన గొప్ప మనసును చాటుకున్నారు. రెండు కాళ్లు, చేతులు లేని ఓ దివ్యాంగుడికి సీఎం వైఎస్‌ జగన్‌ ఆర్థిక సాయం చేశారు. అతన్ని ఆదుకునేందకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి రూ. 5లక్షలు మంజూరు చేశారు. ఈ మేరకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కును డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆ దివ్యాంగుడికి అందజేశారు. అనంతరం నారాయణస్వామి మాట్లాడుతూ.. లక్ష రూపాయల సాయం అడిగితే.. సీఎం రూ. 5లక్షలు ఇవ్వడం చాలా  సంతోషంగా ఉందన్నారు. గొప్ప మానవతావాది ముఖ్యమంత్రిగా లభించడం పేదల అదృష్టం అని తెలిపారు. 

చదవండి : స్పందించిన సీఎం వైఎస్ జగన్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top