హోంమంత్రి కుమార్తె రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్‌ | YS Jagan Attends Mekathoti Sucharitha Daughter Wedding Reception | Sakshi
Sakshi News home page

హోంమంత్రి కుమార్తె రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్‌

Oct 10 2019 8:59 PM | Updated on Oct 10 2019 9:03 PM

YS Jagan Attends Mekathoti Sucharitha Daughter Wedding Reception - Sakshi

సాక్షి, గుంటూరు : రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత కుమార్తె వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. సుచరిత, దయాసాగర్‌ దంపతుల కుమార్తె రిషిక వివాహం తాడేపల్లిగూడెంకు చెందిన అద్దంకి విజయ్‌కుమార్‌, లీలా పరంజ్యోతి దంపతుల కుమారుడు దీపక్‌ కుమార్‌తో తణుకులో బుధవారం ఘనంగా జరిగింది. కాగా, గురువారం మంగళగిరిలో సీకే కన్వెన్షన్‌లో రిషిక-దీపక్‌ల రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు హాజరైన సీఎం వైఎస్‌ జగన్‌ నూతన దంపతులను ఆశీర్వదించి.. శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు మంత్రులు కూడా ఈ రిసెప్షన్‌కు హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు.

రిసెప్షన్‌కు హాజరైన గవర్నర్‌ విశ్వభూషణ్‌
రిషిక-దీపక్‌ రిసెప్షన్‌కు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన నూతన వధూవరులకు బొకేలు అందజేసి ఆశీర్వదించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement