శుభాశీస్సులు | Sakshi
Sakshi News home page

శుభాశీస్సులు

Published Wed, Apr 22 2015 2:44 AM

వధూవరులను ఆశీర్వదిస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి - Sakshi

  •  ఎమ్మెల్సీ కోలగట్ల కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరైన
  •  వైఎస్ జగన్
  •  వధూవరులకు  దీవెనలు
  •  వైఎస్ జగన్ రాకతో కిక్కిరిసిన వేదిక ప్రాంగణం
  •  
     వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ప్రథమ కుమార్తె వివాహ రిసెప్షన్ మంగళవారం ఘనంగా జరిగింది.  వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కార్యక్రమానికి హాజరై వివాహబంధంతో ఒక్కటవుతున్న సంధ్య,నాగాభిషేక్‌లను ఆశీర్వదించారు. నిండునూరేళ్లు వర్థిల్లాలని శుభాకాంక్షలు తెలిపారు. ఆయన రాత్రి 8.15 గంటల సమీపంలో వేదిక వద్దకు చేరుకున్నారు. అనంతరం వీరభద్రస్వామి కుటుంబసభ్యులతో కాసేపు మాట్లాడారు. జగన్‌ను చూసేందుకు పార్టీ నేతలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అరగంట సేపు జగన్‌మోహన్ రెడ్డి అక్కడే గడిపి, అక్కడి నుంచి రాత్రి బస చేసే జిల్లా పరిషత్ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు.    
     
     విజయనగరం మున్సిపాలిటీ/ కంటోన్మెంట్ : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామి ప్రథమ కుమార్తె సంధ్య, నాగాభిషేక్‌ల వివాహ విందు భోజనాలు మంగళవారం ఘనం గా జరిగాయి. బుధవారం వేదపండితుల మంత్రోచ్ఛరణ ల నడుమ ఒక్కటి కానున్న నూతన వధూవరులను వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీర్వదించారు. పట్టణ శివారులోని ఆర్‌కే టవ ర్స్ ప్రాంగణంలో భారీ సెట్టింగ్‌లతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్‌లో మంగళవారం రాత్రి జరిగిన వేడుకలకు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
     
     వధూవరులను ఆశీర్వదించిన వారిలో ప్రతిపక్ష ఉప నాయకులు జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యేలు ఆర్‌వీ సుజయకృష్ణ రంగారావు, రోజా, పాముల పుష్పశ్రీవాణి, పీడిక రాజన్న దొర, బేబీనాయన, ఈశ్వరి, కొండపల్లి అప్పలనాయుడు, ధర్మాన కృష్ణదాస్, బొత్స సత్యనారాయణ,  మాజీ ఎమ్మెల్యేలు శత్రుచర్ల చంద్రశేఖర్‌రాజు, ముత్యాలనాయుడు, బొబ్బిలి చిరంజీవులు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నా యుడు, పరీక్షిత్ రాజు,  కంబాల జోగులు, కాకర్ల పూడి శ్రీనివాసరాజు, అవనాపు విజయ్ తదితరులున్నారు. అలాగే వధూవరులను ఆశీర్వదించిన వారిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ పరిశీలకులు ఆర్‌వీఎస్‌కేకే రంగారావు(బేబీనాయన), పార్టీ రాష్ట్ర కార్యదర్శి సవరపు జయమణి, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కొణతాల రామకృష్ణ,
     
     విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు బెల్లాన చంద్రశేఖర్, నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జిలు కడుబండి శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి అంబళ్ల శ్రీరాములనాయుడు,  పెనుమత్స సురేష్‌బాబు, జమ్మాన ప్రసన్నకుమార్, మార్క్‌ఫెడ్ డెరైక్టర్ కేవీ సూర్యనారాయణరాజు, శ్రీకాకుళం జిల్లా వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షురాలు రెడ్డి శాంతి, దువ్వాడ శ్రీనివాసరావు, పాలవలస రాజశేఖర్, విశాఖ జిల్లా నాయకుడు వంశీకృష్ణయాదవ్, గుడివాడ అమరనాధ్,గండి బాబ్జిలు ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు, విజయనగరం మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, రాష్ట్రమాజీ ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ వీఎస్‌ప్రసాద్, మాజీ పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మజ్జి, శ్రీనివాసరావు, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు బవిరెడ్డి శివప్రసాద్‌రెడ్డి,
     
      సీపీఎం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.కృష్ణమూర్తి, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఇందుకూరి రఘురాజు, ద్రోణంరాజు శ్రీనివాసరావు, తూర్పాటి కృష్ణస్వామినాయుడు, కరణం ధర్మశ్రీ, పాలవలస రాజశేఖరం, తదితరులు నూతన వధూవరులను ఆశీర్వదించారు. కలెక్టర్ ఎంఎంనాయక్, జాయింట్ కలెక్టర్ బి.రామారావు, ఆర్డీఓ జె.వెంకటరావు, విజయనగరం మున్సిపల్ కమీషనర్ ఆర్.సోమన్నారాయణ, మండల తహశీల్దార్ కె.శ్రీనివాసరావులతో పాటు పలువురు జిల్లా అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వేడుకలో ప్రముఖ సంగీత దర్శకుడు కోటి, కామెడీ యాక్టర్‌లు శివారెడ్డి ధనరాజ్, పలువురు యాంకర్‌లు పాల్గొని సందడి చేశారు. జగన్‌మోహన్ రెడ్డి రాక సందర్భంగా ఆర్‌కే టవర్స్ ప్రాంగణం జనాలతో కిక్కిరిసిపోయింది. ట్రాఫిక్ కూడా స్తంభించిపోయింది. దీంతో ఆయన అరగంట సేపు ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు.   
     
     నేడు పెనుమత్స ఇంటికి జగన్
     వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఉదయం నెల్లిమర్ల మండల మొయిద గ్రామం వెళ్లనున్నారు. పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు గృహంలో జరగనున్న ఆయన మనుమని ఉపనయన కార్యక్రమంలో జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారు. ఉదయం 8 గంటలకు విజయనగరం పట్టణం నుంచి బయలుదేరి తిరిగి మళ్లీ 11 గంటల సమంలో నేరుగా అక్కడి నుంచి విశాఖ చేరుకుంటారు.
     

Advertisement
 
Advertisement
 
Advertisement