నేడు వై.ఎస్.జగన్ రాక | ys jagan arrival to vizag from today | Sakshi
Sakshi News home page

నేడు వై.ఎస్.జగన్ రాక

Feb 12 2016 11:17 PM | Updated on May 25 2018 9:20 PM

నేడు వై.ఎస్.జగన్ రాక - Sakshi

నేడు వై.ఎస్.జగన్ రాక

వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి శనివారం విశాఖపట్నం రానున్నారు.

విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి శనివారం విశాఖపట్నం రానున్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే కలమట మోహనరావు కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు జిల్లాకు వస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. వై.ఎస్.జగన్ హైదరాబాద్ నుంచి విశాఖపట్నం  విమనాశ్రయానికి ఉదయం 7.30 గంటలకు చేరుకుంటారు.

విమానాశ్రయంలో జిల్లా పార్టీ నేతలు ఆయనకు స్వాగతం చెబుతారు. కాసేపు జిల్లా పార్టీ నేతలతో సమావేశమవుతారు. అనంతరం నేరుగా శ్రీకాకుళం జిల్లా పాతపట్నం  వెళతారు. వివాహ కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం 7 గంటలకు విశాఖ చేరుకుని హైదరాబాద్ వెళతారు.
 

Advertisement
 
Advertisement
Advertisement