యువకుడి ప్రాణం తీసిన పందెం | youngster dies after drown in well in nellore district | Sakshi
Sakshi News home page

యువకుడి ప్రాణం తీసిన పందెం

May 15 2016 4:20 PM | Updated on Apr 3 2019 8:07 PM

పందెం ఓ యువకుడి ప్రాణం పోవడానికి దారితీసింది.

బాలాయపల్లి: పందెం ఓ యువకుడి ప్రాణం పోవడానికి దారితీసింది. నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలం కడగుంట గ్రామంలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హరి (20) అనే యువకుడు స్నేహితులతో కలసి గ్రామంలోని దిగుడుబావి వద్దకు ఆదివారం వెళ్లాడు. హరికి ఈత రాకపోవడంతో స్నేహితులు పందెం వేశారు.

పందెం కోసం పట్టుదలతో ఈత రాకపోయినా హరి నీటిలోకి దిగడంతో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు అతడి మృతదేహాన్ని వెలికితీశారు.

Advertisement
 
Advertisement
Advertisement