రాష్ట్రపతి భవన్ క్వార్టర్స్‌లో యువతి ఆత్మహత్య | Young girl commits suicide from President Bhavan quarters | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి భవన్ క్వార్టర్స్‌లో యువతి ఆత్మహత్య

May 3 2014 4:32 AM | Updated on Aug 1 2018 2:29 PM

రాష్ట్రపతి భవన్ క్వార్టర్స్‌లో యువతి ఆత్మహత్య రాష్ట్రపతి భవన్ ఆవరణలో గల సర్వెంట్స్ క్వార్టర్స్‌లోని ఓ నివాసంలో యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంచలనం సృష్టించింది.

రాష్ట్రపతి భవన్ క్వార్టర్స్‌లో యువతి ఆత్మహత్యరాష్ట్రపతి భవన్ ఆవరణలో గల సర్వెంట్స్ క్వార్టర్స్‌లోని ఓ నివాసంలో యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంచలనం సృష్టించింది. సాజియా (26) అనే యువతి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉండగా శుక్రవారం తెల్లవారుజాము ఐదున్నర గంటల సమయంలో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్టు ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. సాజియా తన తండ్రికి కేటాయించిన క్వార్టర్స్‌లోని నివాసముంటోందని పోలీసులు తెలిపారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని, ఘటనాస్థలిలో ఎటువంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement